![]() |
![]() |

బుల్లితెర ధారావాహికల్లో స్టార్ మా టీవీలో ప్రసారమైన కార్తీక దీపం సీరియల్ కి ఎంతో ఫ్యాన్ బేస్ ఉంది. "కార్తీక దీపం" సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సీరియల్ లో కార్తీక్, దీప, మోనిత ఈ ముగ్గురు బాగా ఫేమస్ ఐన క్యారెక్టర్స్.
ఈ సీరియల్ లో డాక్టర్ బాబు వంటలక్కలని చూడటానికి తెలుగు ప్రేక్షకులంతా పనులన్నీ మానేసి ఎదురుచూసేవారు. అంత హిట్ అయిన సీరియల్ కి సరైన ఎండింగ్ ఇవ్వలేదంటూ అప్పట్లో ఆడియన్స్ తెగ ఫీల్ అయ్యారు. అక్టోబర్ 2017 నుండి జనవరి 2023 వరకు సాగిన ఈ సీరియల్ పదేహేను వందల అరవై ఆరు ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. అయితే చివరి ఎపిసోడ్ లో డాక్టర్ బాబు, వంటలక్క కలిసి అలా నడుచుంటు ఎక్కడికో వెళ్తున్న ట్టు చూపిస్తారు. అయితే మోనిత ఏం అయింది? ఇద్దరు పిల్లలు ఏం అయ్యారు? ఇంతకి వారిద్దరు ఎక్కడికి వెళ్ళారో చెప్పకుండా ముగించేశారు మేకర్స్. అనుపమ్ పరిటాల తన తర్వాతి సీరియల్ 'రాధకు నీవేరా ప్రాణం' తో అలరిస్తుండగా.. ఇప్పుడు అయితే కార్తీకదీపం సీరియల్ కి సీక్వెల్ గా సెకెండ్ పార్ట్ రాబోతుందంటు ఓ ప్రోమో వదిలారు మేకర్స్.
ఒక చిన్న పాప చీకటి అంటే భయమంటూ.. తనకి అమ్మనాన్న అంటే ప్రాణమని చెప్తుంది. అయితే తనకి ప్రస్తుతం తల్లే సర్వస్వమని చెప్తుంది. ఆ పాప పేరు శౌర్య అని వాళ్ళ అమ్మనాన్నల కథని చెప్పబోతున్నానంటు చెప్తుంది. తెలుగు లోగిల్లు మరువని కథ.. కొత్త వెలుగులతో మళ్ళీ వస్తుంది అనే ట్యాగ్ లైన్ తో ప్రోమోని రిలీజ్ చేశారు. అయితే ఇందులో వంటలక్క, డాక్టర్ బాబు ఉంటారా లేక కొత్త క్యారెక్టర్స్ ఉంటారా? అయితే ఈ సీరియల్ ని ఏ టైమ్ స్లాట్ లో వేస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
![]() |
![]() |